భారీ వర్షాలు..తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సిఎం కేసీఆర్ ఆదేశాలు
- July 09, 2022
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీగా కురుస్తున్నాయి. దీంతో సంబంధిత శాఖల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుంటానని, పరిస్థితులనుబట్టి నేడో రేపో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని పేర్కొన్నారు.
జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సహాయపడాలని, నష్టం జరగకుండా చూసుకోవాలని ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. భారీ వానలు వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







