‘రామారావు’పై రవితేజ సైలెన్స్: ఇలాగైతే కష్టమే రాజా.!
- July 09, 2022
మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇంతవరకూ ఈ సినిమా ప్రమోషన్లలో రవితేజ ఎక్కడా కనిపించడం లేదు. డైరెక్టర్ ఏదో ఒకటీ అరా ఇంటర్వ్యూలతో నెట్టుకొస్తున్నాడు.
కానీ, హీరో, హీరోయిన్లు సినిమాని బొత్తిగా పట్టించుకోవడం లేదు. అసలే రవితేజపై రకరకాల రూమర్లున్నాయ్ ఈ సినిమాకి సంబంధించి. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా రవితేజ కారణంగానే విడుదల ఆలస్యమైందన్న ప్రచారం జరిగింది.
ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా, ప్రమోషన్ బాజా ఇంకా మోగలేదు. ఓ రేంజ్లో ప్రమోషన్లు చేస్తున్నా ఆయా సినిమాల రిజల్ట్ రిలీజ్ తర్వాత తుస్సుమనిపోతోంది. అలాంటిది, అస్సలు అలికిడే లేకుంటే ఎలా మాస్ రాజా.. అంటూ ఆయన అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారు. అసలెందుకు ‘రామారావు’ విషయంలో రవితేజ అంత సైలెంట్‌గా వున్నాడో ఫ్యాన్స్‌కి అర్ధం కావడం లేదు.
ఈ సినిమాకి తెర వెనుక ఏదో గట్టిగానే లొల్లి జరుగుతోందన్న అనుమానాలు వస్తున్నాయ్. అలాగే ఇంతవరకూ జరిగిన ప్రచారాలు కూడా నిజమే అనిపిస్తున్నాయ్ తాజా పరిస్థితులు చూస్తుంటే. ఇలాగైతే కష్టమే మాస్ రాజా.
అసలే ‘ఖిలాడీ’ సినిమా రిజల్ట్ అంతంత మాత్రమే. విడుదలకు ముందు అంత హడావిడి చేసినా ఆ సినిమా భవితవ్యం అలా తేల్చేశారు ప్రేక్షకులు. అలాంటిది ‘రామారావు’ పరిస్థితి ఏంటో. చూడాలి మరి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







