ఇ-కామర్స్ సర్వీస్‌ని ప్రారంభించిన 'క్యూ' పోస్ట్
- April 12, 2016
ఖతార్ పోస్టల్ సర్వీసెస్ కంపెనీ (క్యూ పోస్ట్) ఇ-కామర్స్ మార్కెట్‌ని క్యాష్ చేసుకునేందుకు 'కనెక్టెడ్‌పై బై కతార్ పోస్ట్' అనే కొత్త సర్వీసును ప్రారంభించింది. ప్రపంచంలో ఇ-కామర్స్ మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో ఖతార్ పోస్ట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ జస్సిమ్ సైఫ్ అహ్మద్ అల్ సులాటీ, అరబ్ ఫ్యూచర్ సిటీస్ సమ్మిట్‌లో 'ఇంటర్నేషనల్ పార్సెల్ ఫార్వార్డింగ్ సర్వీస్'ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. క్యు పోస్ట్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఫలే అల్ నైయెమి మాట్లాడుతూ, దేశంలో నివసిస్తున్నవారు ఈ కొత్త సర్వీసులతో వెసులుబాటు పొందుతారని ఆకాంక్షించారు. యూఎస్ మరియు యూకే నుంచి పోస్టల్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్స్‌ని చేసుకోగలుగుతారని ఆయన చెప్పారు. అతి కొద్ది వారాల్లోనే ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ని జపాన్, చైనా మరియు జర్మనీలకు విస్తరిస్తామనీ, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు నెట్‌వర్క్ విస్తరిస్తుందని చెప్పారు. ఖతార్ రెసిడెంట్స్ నుంచి క్యు పోస్ట్ ఫీడ్ బ్యాక్‌ని ఆహ్వానిస్తుందనీ, తద్వారా మరింత మెరుగ్గా ఈ సర్వీసును విస్తరించడానికి వీలవుతుందని ఆయన వివరించారు. ఇ-లాకర్ సిస్టమ్ ద్వారా కస్టమర్ ఓ ప్రత్యే పాస్‌వర్డ్ ద్వారా తన పార్సెల్‌ని కనెక్ట్ చేసుకునేలా ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







