ఎయిర్ అరేబియా విమానం కొచ్చిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- July 16, 2022
కొచ్చి: షార్జాకు వెళ్లాల్సిన ఎయిర్ అరేబియా జి9–426 విమానం సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ ఆకస్మిక పరిణామంతో వెంటనే అప్రమత్తమైన కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు 45 నిమిషాల వ్యవధిలో పరిస్థితులు అన్నింటినీ చక్కదిద్దినట్లు విమానాశ్రయం ఎండీ ఎస్.సుహాస్ తెలిపారు. ఇక్కడకు రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఎయిర్ అరేబియా విమానంలోని 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
విమానం ఇంజిన్ కంపించడం వల్ల దిల్లీ నుంచి వడోదరా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌ను జైపుర్‌కు అత్యవసరంగా దారి మళ్లించారు.ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. విమానం ఇంజనులో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ దారి మళ్లింపు జరిగిందని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించామని డీజీసీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







