సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత సింధూ..
- July 17, 2022
సింగపూర్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ సింగపూర్ ఓపెన్-2022 ఉమెన్స్ టైటిల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై, సింధు విజయం సాధించారు. 21-9, 11-21, 21-15 తేడాతో సింధు, వాంగ్ జిని ఓడించింది. మొదటి గేమ్‌ను సింధు గెలుచుకోగా, రెండో గేమ్‌లో దారుణంగా ఓడిపోయింది.
తర్వాత చివరిదైన మూడో గేమ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి, సింగపూర్ ఓపెన్, సూపర్ 500 టైటిల్ గెలుచుకుంది. భారత దేశం నుంచి ఈ టైటిల్ సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది. ఇంతకుముందు ఈ టైటిల్ సైనా నెహ్వాల్ గెలుచుకుంది. పురుషుల విభాగంలో 2017లో సాయి ప్రణీత్ కూడా గెలుపొందాడు. ఈ ఏడాది ఇది సింధు గెలిచిన మూడో టైటిల్ కాగా, మొదటి సూపర్-500 టైటిల్. ఇంతకుముందు గెలిచిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్.. రెండూ సూపర్-300 టైటిళ్లే.
వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్ మెడల్స్‌తో కలిపి ఇది సింధు తన కెరీర్లో సాధించిన 18వ టైటిల్. సింధు సాధించిన ఈ విజయం ఈ నెల 28న బర్మింగ్‌హమ్‌లో ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్‌కు మరింత స్ఫూర్తినిస్తుంది. ఈ విజయం తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని, తను మరో మెట్టు ఎక్కేందుకు దోహద పడుతుందని సింధు మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్‌లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







