కరాచీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం
- July 17, 2022
షార్జా: షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా కరాచీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ ఓ ప్రకనటలో తెలిపింది.
‘షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం 6E-1406ను కరాచీ వైపు మళ్లించాం. సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించి పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తాం.’ అని ఇండిగో ప్రకటనలో తెలిపింది.
ఇండియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సడెన్ గా కరాచీలో ల్యాండ్ అవడం.. 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానాన్ని కూడా జులై 5న హడావుడిగా పాక్‌లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. అప్పుడు ఫ్యూయల్ ఇండికేటర్ సరిగా పనిచేయలేదు. ఆ ఎస్జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్‌జెట్ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్‌ను భారత్ నుంచి పంపారు. అప్పటివరకు ప్రయాణికులు ఎవరూ ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్‌లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







