హ్యాట్రిక్ దిశగా విక్రమ్, అల్లు అర్జున్...
- April 12, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాను కంప్లీట్ చేసిన బన్నీ.. ఆ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రమోషన్ ను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమా ఏంటి అన్న విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంలో హ్యాట్రిక్ సాధించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్.ఇష్క్, మనం సినిమాలతో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్, ప్రస్తుతం సూర్య హీరోగా 24 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత విక్రమ్, బన్నీ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలోఉన్నాడట. బన్నీ కూడా విక్రమ్ తో సినిమాకు రెడీ గానే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. తన ప్రతీ సినిమా ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించే విక్రమ్ బన్నీతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







