కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం
- April 12, 2016
నగరంలోని కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 ఇల్లు దగ్ధం అయ్యాయి. ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. పాతబస్తీలోని కుల్సుంపురా కబేళా ప్రాంతంలో 200 వందల మంది గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరు రోజువారి కూలీలు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. 5 పాక్షికంగా దగ్ధం అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వ్యాపిస్తున్నాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఘటనాస్థలికి రాలేదు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







