సౌదీ అరేబియాలో ప్రపంచ ఎనిమిదో వింత..
- July 26, 2022
సౌదీ అరేబియా: ప్రపంచంలో ఇప్పటివరకు ఏడు వింతలు ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.కానీ ఇప్పుడు వరల్డ్ లో ఎనిమిదో వింత ఆవిష్కృతం కానుంది. సౌదీ అరేబియాలో త్వరలో అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం కానుంది.పేరుకు తగ్గట్లే ఇది ఎత్తుకన్నా పక్కలకు ఎక్కువగా విస్తరించి ఉంటుంది.ఈ నిర్మాణం ఏకంగా 120 కిలోమీటర్ల పొడవు ఉండనుంది.దీని పొడవు దాదాపుగా అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం అంత ఉండనుంది. ప్రపంచంలోని ఎనిమిదో వింతగా అందరినీ అబ్బురపరచనుంది.ఈ భారీ ప్రాజెక్టులో మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయి.
సౌదీ యువరాజు, ఉప ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏకంగా 26,500 చదరపు కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన భవిష్యత్ నగరం ‘నియోమ్ సిటీ’లో భాగంగా 120 కి.మీ. పొడవైన రెండు సైడ్‌వే స్కైస్క్రాపర్లను నిర్మించనున్నారు. వాయవ్య సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రానికి చెందిన గల్ఫ్ ఆఫ్ అకాబా తీరం నుంచి ఎడారిలో ఉన్న కొండల మధ్య దాకా ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. ఈ రెండు భవనాలను అద్దాలతో అలంకరించనున్నందున దీనికి ‘మిర్రర్ లైన్’ అని పేరు పెట్టారు. ఎత్తులోనూ ఇవి ప్రపంచంలోని ఇతర ఆకాశహర్మ్యాల స్థాయిలో రూపుదిద్దుకోనున్నాయి.
490 మీటర్ల వరకు అంటే దాదాపుగా అర కిలోమీటరు ఎత్తు వరకు ఈ భవనాలను నిర్మించనున్నారు. న్యూయార్క్‌లో ఉన్న 102 అంతస్తుల ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చిట్టచివరి కొనవరకు ఉన్న ఎత్తు 443 మీటర్ల కన్నా ఈ రెండు భవనాలు మరెంతో ఎత్తు వరకు కనిపించనున్నాయి. ఇంత పొడవైన జంట భవనాల్లో కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఇళ్లల్లో ఏకంగా 50 లక్షల మంది నివాసం ఉండవచ్చు. రోజుకు మూడు పూటలా భోజనానికి ‘సబ్‌స్క్రైబ్’ చేసుకున్న వారికి అవసరమైన పంటలను సైతం ఈ విస్తీర్ణంలోనే పండించనున్నారు.
భవనాల ఒక చివరి నుంచి మరో చివరి వరకు 20 నిమిషాల్లో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా భూగర్భంలో హైస్పీడ్ రైల్వే లైన్, పాదచారుల కోసం వాక్ వేస్, నేల నుంచి 1000 అడుగుల ఎత్తులో భారీ స్టేడియం వంటి ఎన్నో హంగులు ఇందులో ఉండనున్నాయి. ఈ పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు కూడా అత్యంత భారీగానే అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సుమారు 50 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏకంగా రూ. 80 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు సమచారం.
తాజా వార్తలు
- Dubai Sports Council launches Annual Sports Events Calendar
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!







