ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం శంకుస్థాపన
- April 13, 2016
సమాజంలో నిరుపేదలకు గూడు, కూడు, గుడ్డ అందించాలని స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో 6 లక్షల గృహాలను నిర్మించాలనే మహా సంకల్పాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం జక్కంపూడి వద్ద ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం శంకుస్థాపన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బలహీనవర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు ఎన్టీఆర్ గృహ నిర్మాణంకు శ్రీకారం చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో రూ. 16,300 కోట్లతో 6 లక్షల మంది లబ్ధిదారులకు పక్కా గృహాలను నిర్మించనున్నామన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి జక్కంపూడి వద్ద ఆవిష్కరించనున్నారని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో 166 నియోజకవర్గాల్లో 774 గ్రామాల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి సబంధించిన కార్యక్రమాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 290 ఎస్‌ఎఫ్‌టి, పట్టణ ప్రాంతాల్లో 400 ఎస్‌ఎఫ్‌టితో డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్‌లను నిర్మించనున్నామన్నారు. గృహ నిర్మాణ పథకంలో గతంలో జరిగిన అవకతవకలు పునరావృతం కాకుండా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసామన్నారు. గతంలో మంజూరై నిర్మాణంలో ఆగి అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు చెందిన లబ్ధిదారుల అర్హతలను పరిశీలించి వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి వెంట గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ సిహెచ్ మల్లిఖార్జునరావు, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శరత్‌బాబు, డిఆర్‌డిఏ పిడి చంద్రశేఖరరాజు, స్తానిక తహశీల్దార్ మధన్‌మోహన్ తదితరులు ఉన్నారు
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







