విజయ్ ‘లైగర్’తో అయినా ‘అది’ సాధ్యమవుతుందా.!
- August 01, 2022
విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘లైగర్’. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరెక్కించిన చిత్రమిది. తొలిసారి విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా లెవల్లో నటించిన ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. రిలీజ్ టైమ్ ఇంకా చాలా వుంది. కానీ, అప్పుడే ప్రమోషన్లు స్టార్ట్ చేసేశాడు మనోడు. ప్రమోషన్ల పేరు చెప్పి దేశం మొత్తం టూర్స్ ప్లాన్ చేశాడు. ఎక్కడ విజయ్ ఈవెంట్ పెట్టినా, అక్కడికి జనం లక్షల్లో పోటెత్తేస్తున్నారు.
అది చూసి, విజయ్ కూడా ఆశ్చర్యపోతున్నాడు. మా నాన్న మీకు తెల్వద్, మా తాత మీకు తెల్వద్.. నాపై మీకు ఎందుకురా ఇంత అభిమానం..! అంటూ అభిమానుల అభిమానానికి విజయ్ భావోద్వేగానికి లోనవుతున్నాడు కొన్నిసార్లు. తాజాగా ముంబైలో ఓ మాల్లో విజయ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు.
ఈ ఈవెంట్‌కి వచ్చిన జనం ‘సునామీ’ని తలపిస్తోంది. ఈ జన సునామీని చూసి, విజయ్‌కి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. డిఫరెంట్ ఆటిట్యూడ్, యూత్ ఎట్రాక్షన్.. వంటి విభిన్నమైన లక్షణాలున్నాయ్ హీరోగా విజయ్ దేవరకొండలో.
అదే విజయ్‌పై అంతటి అభిమానం పెంచుకునేలా చేస్తోంది. సరే, జన సునామీ ఇలా వుంది సరే, కానీ, ‘లైగర్’ పరిస్థితేంటో. ఇది మరో ‘అర్జున్ రెడ్డి’ అవుతుందా.? విజయ్ కెరీర్లో. ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయ్. కనీసం విజయ్ పుణ్యమా అని అయినా, బాక్సాఫీస్ కళకళలాడుతుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు







