విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ: ఎవరికి తగలాలో వాళ్లకే తగిలిందిగా.!
- August 01, 2022
టాలీవుడ్ ముచ్చటైన జంటగా పాపులర్ అయిన చై శామ్, విడాకుల తర్వాత కూడా చాలా సెన్సేషనల్ అయిన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకుని నెలలు గడుస్తున్నా, ఈ ఇష్యూపై రగడ కొనసాగుతూనే వుంది. చై కామ్‌గా వున్నా, సమంత కెలుకుతూనే వుంది.
ఇదిలా వుంటే, తాజాగా చై స్పందించాడు. విడాకులు అనేది తన పర్సనల్ ఇష్యూ. పర్సనల్ ఇష్యూస్‌ని బయటపెట్టడానికి నాకు ఇష్టముండదు. విడాకులు విషయంలో ఏం జరిగిందో, నాకూ, నా కుటుంబ సభ్యులకు తెలుసు. అంతకు మించి బజారుకీడ్చి రచ్చ చేయాల్సిన అవసరం నాకు లేదు.
చెప్పాల్సినదంతా ముందే చెప్పేశాం. పదే పదే ఆ విషయం గురించి రచ్చ చేసుకోవడం నాకు నచ్చదు.. సినిమాల గురించి ఎంతైనా మాట్లాడతాను. కానీ, పర్సనల్ లైఫ్‌కి కొన్ని లిమిట్స్ వుంటాయ్.. అని చై స్పందించాడు.
లేట్‌గా స్పందించినా, లేటెస్టుగా వండర్ ఫుల్ స్టేట్‌మెంట్స్ ఇచ్చి అదరగొట్టేశాడు నాగ చైతన్య. ఇదీ వ్యక్తిత్వం అంటే. ఎంతైనా సీనియర్ హీరో వారసుడు అనిపించుకున్నాడు.. అంటూ చైతూని నెటిజనంతో పాటూ అందరూ ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో సమంతను మరోసారి టార్గెట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!