‘వీసా’ కోసం ‘బాలాజీ’కి అప్లికేషన్‌

- June 14, 2015 , by Maagulf
‘వీసా’ కోసం ‘బాలాజీ’కి అప్లికేషన్‌

వీసా కావాలా? బాలాజీకి అప్లికేషన్‌ పెట్టుకోండి. 11 ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటే వీసా వచ్చి చేతుల్లో పడుతుంది. ఇది ‘వీసా బాలాజీ’ భక్తుల నమ్మకం. కేవలం నమ్మకమే కాదు నిజమని అంటారు వీసా బాలాజీ భక్తులు. హైద్రాబాద్‌ శివార్లలో చిలుకూరు గ్రామంలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ‘వీసా బాలాజీ’గా భక్తులు పిలుస్తారు. మిగతా దేవాలయాలకు భిన్నంగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. టిక్కెట్‌ ఉండదు. కోటీశ్వరుడైనా సామాన్యుడైనా ఒకేలా ట్రీట్‌ చేయబడతాడు. 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే ఆ కోరిక తీరిపోవాల్సిందే. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. ఈ దేవాలయానికి ఎక్కువగా విద్యార్థులు వెళుతుంటారు. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకున్న, ఉద్యోగాన్ని ఆశిస్తున్న యువతీ యువకులు వీసా బాలాజీకి తమ కోరికలు చెప్పుకుంటారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వీసా బాలాజీని దర్శించుకునేందుకు తరలి వస్తారు. శుక్ర, ఆదివారాల్లో దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. గోవింద నామ స్మరణతో దేవాలయ ప్రాంగణం మార్మోగుతుంది.దేవాలయ ప్రాంగణం లో ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు అని సంగసేవకులు  శ్రీ యం.భీంరెడ్డి గారు చెప్పారు.

 

--యం.భీంరెడ్డి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com