సిద్ధమైన న్యూ సలాలా ఎయిర్‌పోర్ట్‌

- June 14, 2015 , by Maagulf
సిద్ధమైన న్యూ సలాలా ఎయిర్‌పోర్ట్‌


సలాలా కొత్త ఎయిర్‌పోర్ట్‌ సోమవారం నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది.ఫస్ట్‌ స్టేజ్‌లో 65 వేల చదరపు మీటర్ల టెర్మినల్‌ ఏడాదికి 2 మిలియన్‌ పాసింజర్లను అకామడేట్‌ చేసేందుకు వీలుగా మలచబడింది. 4 కిలోమీటర్ల పొడవు, 72 మీటర్ల వెడల్పుతో కూడిన అతి పొడవైన రన్‌వే మీద ఏ 380 వంటి అతిపెద్ద విమానాలు సైతం తేలిగ్గా ల్యాండ్‌ అయ్యేందుకు వీలుంది. లేటెస్ట్‌ నావిగేషన్‌ సిస్టమ్‌, ఆటో ల్యాండిరగ్‌ డివైజెస్‌ను ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు, నిబంధనలకు తగ్గట్టుగా పొందుపరిచారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో 57 మీటర్ల ఎత్తయిన కంట్రోల్‌ టవర్‌ హైలైట్‌గా నిలుస్తుంది. 29 లిఫ్ట్‌లు, 13 ఎస్కలేటర్స్‌ 8 ట్యూబ్స్‌తో ప్రయాణీకులకు అత్యంత ఉపయోగకరంగా తీర్చిదిద్దారు.


 
--నూనె లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com