‘వీసా’ కోసం ‘బాలాజీ’కి అప్లికేషన్
- June 14, 2015
వీసా కావాలా? బాలాజీకి అప్లికేషన్ పెట్టుకోండి. 11 ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటే వీసా వచ్చి చేతుల్లో పడుతుంది. ఇది ‘వీసా బాలాజీ’ భక్తుల నమ్మకం. కేవలం నమ్మకమే కాదు నిజమని అంటారు వీసా బాలాజీ భక్తులు. హైద్రాబాద్ శివార్లలో చిలుకూరు గ్రామంలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ‘వీసా బాలాజీ’గా భక్తులు పిలుస్తారు. మిగతా దేవాలయాలకు భిన్నంగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. టిక్కెట్ ఉండదు. కోటీశ్వరుడైనా సామాన్యుడైనా ఒకేలా ట్రీట్ చేయబడతాడు. 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే ఆ కోరిక తీరిపోవాల్సిందే. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. ఈ దేవాలయానికి ఎక్కువగా విద్యార్థులు వెళుతుంటారు. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకున్న, ఉద్యోగాన్ని ఆశిస్తున్న యువతీ యువకులు వీసా బాలాజీకి తమ కోరికలు చెప్పుకుంటారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వీసా బాలాజీని దర్శించుకునేందుకు తరలి వస్తారు. శుక్ర, ఆదివారాల్లో దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. గోవింద నామ స్మరణతో దేవాలయ ప్రాంగణం మార్మోగుతుంది.దేవాలయ ప్రాంగణం లో ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు అని సంగసేవకులు శ్రీ యం.భీంరెడ్డి గారు చెప్పారు.
--యం.భీంరెడ్డి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన







