హజ్ యాత్రికుల నిష్క్రమణకు ఆగస్ట్ 13 డెడ్ లైన్

- August 11, 2022 , by Maagulf
హజ్ యాత్రికుల నిష్క్రమణకు ఆగస్ట్ 13 డెడ్ లైన్

రియాద్ : ఈ సంవత్సరం హజ్ చేసిన యాత్రికులు సౌదీ అరేబియా నుండి బయలుదేరడానికి ఆగస్టు 13 (శనివారం)ను తుది గడువుగా నిర్ణయించినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాలలో యాత్రికులకు సేవలను అందించే తవాఫా కంపెనీలు యాత్రికుల నిష్క్రమణ షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు యాత్రికుల బృందాల నిష్క్రమణను సులభతరం చేయడానికి మంత్రిత్వ శాఖ కంపెనీలను అప్రమత్తం చేసింది. సౌదీలో హజ్ వ్యవహారాలను నిర్వహించే కంపెనీలలో యాత్రికుల వివరాలను తనిఖీ చేయాలని అధికారులకు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆర్గనైజింగ్ కంపెనీల ద్వారా ఈ సేవల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఉమ్రా పర్యటనలో ఉన్న యాత్రికుల డాక్యుమెంట్ కాంట్రాక్టును పరిశీలించాలని మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com