కువైట్ సిటీలో మొబైల్ కార్ట్ లకు స్థలాల కొరత

- August 11, 2022 , by Maagulf
కువైట్ సిటీలో మొబైల్ కార్ట్ లకు స్థలాల కొరత

కువైట్ సిటీ: మొబైల్ కార్ట్ లకు ఖాళీ స్థలాలు లేకపోవడంతో చిరువ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.  1,800 కంటే ఎక్కువ లైసెన్స్ కలిగిన కార్ట్‌ల కోసం కేవలం 400 సైట్‌లు మాత్రమే కేటాయించబడ్డాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి వీలుగా సైట్‌ల కేటాయింపుపై బాధ్యతను కువైట్ మునిసిపాలిటీ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి మునిసిపాలిటీకి బదిలీ చేయాలని లైసెన్స్ హోల్డర్లందరూ కోరుతున్నారు. కొత్త రహదారి ఆక్యుపెన్సీ జాబితాలో ఈ వాహనాలకు సంబంధించిన నిబంధనలను సవరించే పని జరుగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. సవరణలు అమల్లోకి వస్తే అదనపు సైట్లు కార్ట్ లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. కార్ట్ ల వ్యాపారులకు అనువుగా మరికొన్ని సైట్లను కేటాయించే అంశంపై త్వరలోనే మున్సిపల్ కౌన్సిల్‌కు చర్చకు రానుందన్నారు. ముఖ్యంగా క్లబ్‌ల పార్కింగ్ స్థలాలు, పబ్లిక్ పార్కులు, తీరప్రాంతాల్లో కార్ట్ వ్యాపారులకు అనుమతించే విషయాన్ని పరిశీలించనున్నారు. అయితే, ఈ ప్రతిపాదనలను వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంకా ఆమోదించాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com