హజ్ యాత్రికుల నిష్క్రమణకు ఆగస్ట్ 13 డెడ్ లైన్
- August 11, 2022
రియాద్ : ఈ సంవత్సరం హజ్ చేసిన యాత్రికులు సౌదీ అరేబియా నుండి బయలుదేరడానికి ఆగస్టు 13 (శనివారం)ను తుది గడువుగా నిర్ణయించినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాలలో యాత్రికులకు సేవలను అందించే తవాఫా కంపెనీలు యాత్రికుల నిష్క్రమణ షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు యాత్రికుల బృందాల నిష్క్రమణను సులభతరం చేయడానికి మంత్రిత్వ శాఖ కంపెనీలను అప్రమత్తం చేసింది. సౌదీలో హజ్ వ్యవహారాలను నిర్వహించే కంపెనీలలో యాత్రికుల వివరాలను తనిఖీ చేయాలని అధికారులకు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆర్గనైజింగ్ కంపెనీల ద్వారా ఈ సేవల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఉమ్రా పర్యటనలో ఉన్న యాత్రికుల డాక్యుమెంట్ కాంట్రాక్టును పరిశీలించాలని మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







