కైరో: చర్చిలో అగ్నిప్రమాదం.. 41 మంది మృతి
- August 14, 2022
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో ఉన్న కాప్టిక్ క్రిస్టియన్ చర్చిలో ఆదివారం అగ్నప్రమాదం జరిగి సుమారు 41 మంది మృతి చెందినట్లు ఆ చర్చి అధికారులు ప్రకటించారు.అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియవని, దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై ఈజిప్టు అధినేత అబ్దెల్ ఫట్టా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫేస్బుక్ ద్వారా ఆయన స్పందిస్తూ ‘‘ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించాను, అలాగే ప్రమాద తీవ్రతను తగ్గించే చర్యలు చేపట్టమని చెప్పాను’’ అని తెలిపారు. ప్రమాదం జరిగిన కొద్ది సమయానికి మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపింది.
మధ్యప్రాచ్యంలో కాప్ట్స్ అతిపెద్ద చర్చి. అంతే కాదు ఈ చర్చి నేతృత్వంలోని ఈజిప్టులోనే అతిపెద్ద క్రైస్తవ సంఘం ఉంది. ఈజిప్టులోని 103 మిలియన్ల జనాభాలో కనీసం 10 మిలియన్లు ఈ సంఘంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇస్లామిస్టులకు క్రిస్టియన్లకు మధ్య చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. 2013లో ఇస్లామిస్ట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మోర్సీని పదవీచ్యుతున్ని చేసిన అనంతరం దేశంలో పలు చోట్ల చర్చిలు, పాఠశాలలు, నివాసాలు దగ్ధమయ్యాయి.
అనంతరం సిసి దేశాధినేత అయ్యారు. మొదటిసారి చర్చిని సందర్శించిన ఈజిప్టు నేత సిసి రికార్డు సృష్టించారు. ఇటీవలే మొదటిసారిగా రాజ్యాంగబద్ధ న్యాయస్థాన పదవిలో కాప్టిక్ వ్యక్తిని నియమించారు. కాగా, ఇటీవలిలో ఈజిప్ట్ అనేక ఘోరమైన అగ్నిప్రమాదాలు జరిగాయి. మార్చి 2021లో కైరోలోని తూర్పు శివారులోని వస్త్ర కర్మాగారంలో తలెత్తిన అగ్ని ప్రమాదంలో 20 మంది మరణించారు. 2020లో రెండు ఆసుపత్రులు మంటల్లో చిక్కుకోవడంతో 14 మంది కోవిడ్-19 రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







