దుబాయ్ వాసులకు హెచ్చరిక..
- August 18, 2022
దుబాయ్: ఆన్లైన్ వేదికగా ఇతరులను అవమానపరిచే విధంగా సందేశాలు పంపించే దుబాయ్ వాసులను అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.సోషల్ మీడియాలో తోటివారిని అవమాన పరిస్తే 5లక్షల దిర్హాములు వరకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని ప్రాసిక్యూషన్ వెల్లడించింది.ఈ మేరకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ వీడియోను విడుదల చేసింది.డీరా ప్రాసిక్యూషన్, అసిస్టెంట్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఖలీద్ హసన్ అల్ ముతావా మాట్లాడుతూ..ఆన్లైన్లో తోటివారిని అగౌరవపరిచే సందేశాలు పెట్టడం, అవమానపరుస్తూ మానసికక్షోభకు గురిచేయడం తీవ్ర నేరమని పేర్కొన్నారు.ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడేవారికి ఇకపై కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానాలు ఉంటాయన్నారు. 5లక్షల దిర్హాములు వరకు జరిమానా ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ సంఘటనను ఆయన ప్రస్తావించారు. ఓ యువకుడు తనతో పాటు పనిచేసే సిబ్బందిని అవమాన పరిచేలా వాట్సాప్ లో సందేశంపంపించాడు.దాంతో అతడికి 10వేల దిర్హాములు జరిమానా విధించినట్లు చెప్పారు. అల్ ఐన్ న్యాయస్థానంలో ఇటీవల ఈ కేసు విచారణకు రావడంతో దోషిగా తేలిన యువకుడికి కోర్టు ఈ భారీ జరిమానా విధించింది. అతని వల్ల బాధింపబడిన వ్యక్తికి ఈ జరిమానాను పరిహారంగా ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. దుబాయ్ ఆన్లైన్ చట్ట ఉల్లంఘనకు పాల్పడినందుకు గాను సదరు యువకుడికి ఈ భారీ జరిమానా పడిందని ప్రాసిక్యూటర్ ఖలీద్ హసన్ చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







