యుఏఈ లో మధ్యాహ్న విరామం నేటినుంచే

- June 15, 2015 , by Maagulf
యుఏఈ లో మధ్యాహ్న విరామం నేటినుంచే

మండుతున్న ఎండల నుంచి కార్మికులకు ఉపశమనం కల్పించేందుకు ‘మధ్యాహ్న విరామం’ అనే నిబంధనను ప్రభుత్వం ప్రతి యేటా అమలు చేస్తూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా నేటి నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలపాటు ఎండల్లో పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా ఆయా కంపెనీలు పనికి విరామం కల్పించాల్సి ఉంటుంది. విరామ సమయాన్ని మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటలు వరకు నిర్ణయించింది ప్రభుత్వం. సెప్టెంబర్‌ 15 వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుంది. కార్మికులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కన్‌స్ట్రక్షన్‌ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఈ నిబంధన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ నిబంధన ద్వారా పనివేళలు కుదించుకుపోతాయనీ, తద్వారా అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి కాబోవని నిర్మాణ రంగ సంస్థలు అంటున్నాయి. అయినప్పటికీ కార్మికుల భద్రతే లక్ష్యంగా వ్యవహరిస్తున్న తాము ప్రభుత్వ నిబందనలకు తగ్గట్లుగా కార్మికులకు విరామ సమయాన్ని కేటాయిస్తామని వివిధ సంస్థలు చెప్పాయి. 18 బృందాల్ని నిరంతర తనిఖీల కోసం కేటాయించిన ప్రభుత్వం, వివిధ ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించేలా తగు ఏర్పాట్లు చేసింది.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com