అమెరికాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవం
- August 22, 2022
అమెరికా: ఐకాన్ సార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా.. అమెరికాలో జరిగిన 'ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ 2022' కి ఈ ఏడాది గ్రాండ్ మార్షల్ హోదాలో భారతదేశం నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాతినిధ్యం వహించారు. సతీమణి స్నేహతో కలిసి ఈ ఈవెంట్ కు హాజరయ్యారు అల్లు అర్జున్. దీనికి ఏకంగా 5 లక్షల మంది హాజరై.. భారతదేశం పట్ల ఉన్న దేశభక్తిని.. అల్లు అర్జున్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఏ సంవత్సరం కూడా ఇంతమంది హాజరు కాలేదని, పెరేడ్ కు ఇంతమంది ప్రవాస భారతీయులు రావడం ఒక రికార్డుగా అభివర్ణిస్తున్నారు ప్రతినిధులు. 2022లో ఓ ఈవెంట్ కోసం 5 లక్షల మంది బయటకు రావడం ఇదే మొదటిసారి. మువ్వన్నెల భారత జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ న్యూయార్క్ వీధుల్లో విహరించారు అల్లు అర్జున్. ఆయనను చూడడానికి అభిమానులు భారీగా హాజరయ్యారు. తగ్గేదేలే.. జైహింద్ అంటూ ప్లకార్డులు పట్టుకొని చూపించారు. అందరినీ ప్రేమతో పలకరిస్తూ అభిమానులతో ముచ్చటించారు అల్లు అర్జున్. అనంతరం న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్.. అల్లు అర్జున్ ను సన్మానించారు. కాసేపటి భేటి తర్వాత ఇద్దరూ కలిసి తగ్గేదే లే సిగ్నేచర్ మూమెంట్ చేశారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







