యూఏఈ మొదటి కమర్షియల్ మహిళా కెప్టెన్‌గా ఐషా అల్ మన్సూరి కొత్త చరిత్ర
- August 26, 2022
యూఏఈ: ఎతిహాద్ పైలట్ ఐషా అల్-మన్సూరి(33) మొట్టమొదటి మహిళా వాణిజ్య కెప్టెన్‌గా యూఏఈ విమానయాన రంగంలో కొత్త చరిత్రను సృష్టించింది. దేశం వార్షిక ఎమిరాటీ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కొద్ది రోజుల ముందు ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా తనకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన ఎతిహాద్ ఎయిర్వేస్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎతిహాద్ క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్‌లో చేరి తన కెరీర్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కమర్షియల్ ఎయిర్‌లైన్స్‌లో కెప్టెన్‌గా పనిచేసిన మొదటి మహిళా ఎమిరాటీగా తను గర్వపడుతున్నానని, ఇది యువతులకు విమానయాన రంగంవైపు వచ్చేందుకు తను ఒక ప్రేరణగా నిలుస్తానని ఐషా అల్-మన్సూరి పేర్కొన్నారు. ఎతిహాద్ క్రూ బ్రీఫింగ్ సెంటర్లో జరిగిన కమాండ్ అప్‌గ్రేడ్ వేడుకలో ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహ్మద్ అల్ బులూకీ నుంచి కొత్త ర్యాంకును స్వీకరించారు. సూపర్ జంబో ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌బస్ A380ని నడిపిన మొదటి UAE జాతీయురాలుగా ఐషా ఇదివరకే రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







