కాలేజీకి డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై కేసు పెట్టిన కూతురు
- August 28, 2022
బహ్రెయిన్: తన కుమార్తె చదువు ఖర్చులను భరించడానికి నిరాకరించిన తండ్రిపై కోర్టు సీరియస్ అయింది. ఆమెకు నెలకు BD50 చెల్లించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తల్లి నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కాలేజీ ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడం మానేశాడని తండ్రిపై కూతురు ఆరోపించింది. తనతో పాటు తన సోదరుడి చదువు కూడా ఇబ్బందుల్లో పడిపోవడంతో కూతురు తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. తన కళాశాల ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించేందుకు తన తండ్రి నిరాకరించాడని, దీంతో తన ఆర్థిక అవసరాలు తీర్చేందుకు తల్లిపై భారం పడుతుందని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. తన తండ్రి తనకు ఎలాంటి ఆర్థిక భద్రత కల్పించలేదని, తన ఉన్నత చదువులు, పోషణ, ఖర్చులు, భవిష్యత్తు గురించి పట్టించుకోవడం లేదని చెప్పింది. తన తండ్రి చర్య తనను, తన సోదరుడిని చాలా కష్టాల్లోకి నెట్టిందని, పెరుగుతున్న ఆర్థిక కట్టుబాట్ల కారణంగా తన తల్లికి తన ఖర్చులు భరించడం కష్టంగా ఉందని బాలిక కోర్టుకు తెలిపింది. విచారణ సందర్భంగా బాలిక ఇప్పటికీ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నందున పాకెట్ మనీ పొందేందుకు అర్హులని కోర్టు అభిప్రాయపడింది. అమ్మాయి తన తండ్రి నెలవారీ ఆదాయం ఆధారంగా నెలవారీ భత్యాన్నికోర్టు నిర్ణయించింది. సదరు తండ్రి తన కుమార్తెకు నెలకు BD50 చెల్లించాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







