రిజర్వ్ ఫారెస్టులో ఎంటరైన వాహనం సీజ్
- August 28, 2022
దోహా: రిజర్వ్ ఫారెస్టులోకి ప్రవేశించి పర్యావరణానికి హాని కలిగించిన వాహనాన్ని పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. పర్యావరణ పర్యవేక్షణకు సంబంధించి 1995 నాటి చట్టం నెం. 32ను ఉల్లంఘించి, ఒక రిజర్వ్ గడ్డి మైదానంలోకి ప్రవేశించిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 1995 నాటి చట్టం సంఖ్య. (32) ప్రకారం.. కార్లు, యంత్రాలు మొక్కల పర్యావరణ ప్రాంతాల గుండా వెళ్లడం నిషేధం. రిజర్వ్ ఫారెస్టులతో సహా సహజ పర్యావరణ పరిసరాలలో వాహనాలను నడపకూడదని, ఖతార్ పర్యావరణాన్ని కాపాడాలని, వాహనదారులు రోడ్లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







