వీసా బదిలీ వార్తల్లో వాస్తవం కొంతే: పీఏఎం
- August 28, 2022
కువైట్: బ్లాక్ చేసిన కంపెనీల కింద ఉన్న కార్మికుల రెసిడెన్సీని కొత్త కంపెనీలకు బదలాయించడాన్ని అనుమతించడంపై ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తలపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎం) స్పందించిది. ఈ వార్తల్లో ఉన్న తప్పులను ఎత్తిచూపింది. అధికార యంత్రాంగం ఎల్లప్పుడు కార్మిక ఫిర్యాదుల పరిష్కారం కోసం పనిచేస్తుందన్నారు. కార్మిక చట్టం విషయంలో జారీ చేసిన నిబంధనలు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా బదిలీకి సంబంధించి పరిపాలనా నిర్ణయం నం. 842/2015 కొత్త యజమానికి (స్పాన్సర్), ఉద్యోగికి సంబంధించిన సవరణలని తెలిపింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్స్‌లోని అంశాలు, నిబంధనలు, సవరణలు రెసిడెన్సీ బదిలీకి సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలలో ఎటువంటి సమాచారం లేదని పీఏఎం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







