భారత్ కరోనా అప్డేట్
- August 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 9,436 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 86,591 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని వివరించింది. గత 24 గంటల్లో దేశంలో 9,999 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,37,93,787కి చేరిందని వివరించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.93 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.70 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 88.50 కరోనా పరీక్షలు చేశారని పేర్కొంది. నిన్న 3,22,551 కరోనా పరీక్షలు చేసిననట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 211.66 కోట్లుగా ఉందని పేర్కొంది.
వాటిలో రెండో డోసులు 94.18 కోట్లు, బూస్టర్ డోసులు15.20 కోట్లుగా ఉన్నాయని చెప్పింది. నిన్న 26,53,964 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో నిన్న కూడా 10 వేల కంటే తక్కువగానే కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







