దావూద్ ఇబ్రహీం పై భారీ రివార్డ్ ప్రకటించిన NIA!
- September 01, 2022
ముంబై: అండర్ వరల్డ్ డాన్, ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం, అతని ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఆచూకీ కానీ, వారికి సంబంధించిన సమాచారం కానీ చెప్పిన వారికి భారీ రివార్డ్ ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రకటించింది. దావూద్ కు చెందిన సమాచారం ఇచ్చిన వారికి రూ. 25 లక్షలు, చోటా షకీల్ సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇతర టెర్రరిస్టులు అనీస్ ఇబ్రహీం, జావెద్ చింకా, టైగర్ మెమన్ లపై రూ. 15 లక్షల చొప్పున రివార్డ్ ప్రకటించింది.
గత ఏడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ మాట్లాడుతూ… దావూద్, ఇతరులందరూ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఆల్ ఖైదా వంటి అంతర్జాతీయ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లతో కలిసి పని చేస్తున్నారని తెలిపింది. బంగారం స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ కార్యకలాపాలను కొనసాగించిన దావూద్ కు చెందిన ‘డీ కంపెనీ’ రాత్రికి రాత్రే టెర్రరిస్ట్ సంస్థగా మారిపోయి 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిందని పేర్కొంది. ఈ పేలుళ్లలో 250కి పైగా అమాయకులు ప్రాణాలను కోల్పోయారని… మిలియన్ల డాలర్ల విలువైన ఆస్తుల నష్టం జరిగిందని తెలిపింది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







