పొలిటికల్ టర్న్ తీసుకున్న శర్వానంద్: సక్సెస్ అవుతాడా.?
- September 06, 2022
ఈ మధ్య శర్వానంద్‌కి ఏదీ కలిసి రావడం లేదు. ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ తదితర సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న శర్వానంద్ ట్రాక్ తప్పాడు. వరుసగా ఫెయిల్యూర్స్ ఇస్తున్నాడు. ఇటీవల శర్వానంద్ నుంచి వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.
లేటెస్టుగా ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు శర్వానంద్. సెప్టెంబర్ 9న ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేని ఈ సినిమా శర్వానంద్‌కి కలిసొస్తుందో లేదో తెలీదు కానీ, ఈ లోపే శర్వానంద్ కొత్త టర్న్ తీసుకున్నాడు.
ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో శర్వానంద్‌కి జోడీగా అందాల భామ రాశీ ఖన్నా నటిస్తోంది.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా ఓ ఇంటెన్స్ కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న రోల్స్‌లో శర్వానంద్ కనిపించబోతున్నాడట. అందులో ఓ పాత్ర కోసం సీరియస్ మోడ్‌లో శర్వా కనిపించబోతున్నాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!