మటన్ కీమా కోఫ్తా కర్రీ
- April 16, 2016
కావలసిన పదార్థాలు: కీమా మటన్ - అరకేజీ, కొత్తిమీర తరుగు - అరకప్పు, జీలకర్ర పొడి - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. కర్రీ కోసం: నూనె - 1 టేబుల్ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లి రేకలు - 5, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు, టమోటో గుజ్జు - 1 టేబుల్ స్పూను, పసుపు - చిటికెడు, గరం మసాల - 2 టీ స్పూన్లు, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, యాలకుల పొడి - అర టీ స్పూను, నీరు - 4 కప్పులు, పెరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఉల్లిపాయ తరిగి కొద్ది నూనెలో దోరగా వేగించి అల్లం, వెల్లుల్లితో కలిపి రుబ్బుకోవాలి. నీరు వడకట్టిన కీమాలో కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి నిమ్మకాయంత ఉండలు చేసుకుని పక్కనుంచాలి. నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లి పేస్టు వేగించాలి. టమోటా గుజ్జు, పసుపు, గరం మసాల, దాల్చినచెక్క, యాలకుల పొడి, ఉప్పు, నీరు కలిపి మరిగించాలి. ఇప్పుడు కీమా ఉండల్ని మెల్లగా అందులో వేసి చిన్నమంటపై (గరిటెతో కలపకుండా) గంటన్నర సేపు ఉడికించాలి. కూర చిక్కబడ్డాక పెరుగు వేసి కొత్తిమీరతో అలంకరించి దించేయాలి. రోటీ, నాన్‌తో ఎంతో రుచిగా ఉండే కోఫ్తా కర్రీ ఇది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







