రాజమౌళి, మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్: ఏ జోనరో తెలుసా.?
- September 13, 2022
రాజమౌళి సినిమా అంటేనే ఆ లెవలే వేరు. అంచనాలు ఆకాశాన్ని అంటేస్తుంటాయ్. ‘బాహుబలి’ కోసం రాజులు, రాజ్యాలు తీసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం వేర్వేరు కాలాలకు సంబంధించిన ఇద్దరు స్వాతంత్ర్య వీరుల్ని ఒకే కాలంలో కలిపేసి కన్విన్సింగ్‌గా కథ నడిపించేశారు. దేశం గర్వించదగ్గ ప్రశంసలు దక్కించుకున్నారు.
ఇక ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా ఎలా వుండబోతోంది.? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఖచ్చితంగా రాజమౌళి సినిమా అంటే విజువల్స్ మెయిన్ పాయింట్. ఈ సినిమా కోసం ప్రేక్షకుల అంచనాలకు అందని విజువల్స్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ప్రపంచం మొత్తం చుట్టేయనున్నారట విజువల్స్ కోసం.
అలాగే, సినిమా జోనర్ విషయానికి వస్తే, ఇదో అడ్వెంచర్ మూవీ అని ప్రచారం జరిగింది. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారట. అలాగే, ఫారెన్ నుంచి ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో భాగం కానున్నారట.
గ్లోబల్ వైజ్ క్రేజ్ దక్కించుకునేలా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారనీ తెలుస్తోంది. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ నడుస్తోందట. విజయేంద్ర ప్రసాద్ ఈ యాక్షన్ అడ్వెంచర్ కథకు మెరుగులు దిద్దుతున్నారు.
మరోవైపు మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు