పవన్ లిస్టులో మరో రీమేక్ మూవీ.!?

- September 13, 2022 , by Maagulf
పవన్ లిస్టులో మరో రీమేక్ మూవీ.!?

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా రీమేక్ మూవీసే చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ఇంతవరకూ చేసిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు రీమేక్ సినిమాలే. ‘వినోదయ సితం’ అను మరో తమిళ రీమేక్ మూవీ లైన్‌లో వుంది. ఇవి కాక మరికొన్ని రీమేక్ ప్రాజెక్టులున్నాయ్. తాజాగా మరో కొత్త రీమేక్ పవన్ లిస్టులో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్ధ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీగా వుంది. అయితే, ఈ సినిమా కథా, కథనాలు కొద్దిగా ‘వినోదయ సితం’ సినిమాని పోలి వున్నాయట. ‘వినోదయసితం’తో పోల్చితే, కామెడీ డోస్ చాలా చాలా ఎక్కువగా వుందట. 
ఫాంటసీ కామెడీ నేపథ్యమే అయినా, కన్విన్సింగ్ కథనంగా రూపొందిందనీ బాలీవుడ్ ఇండస్ర్టీలో ప్రచారం జరుగుతోంది. దాంతో పవన్ కళ్యాణ్ ‘వినోదయసితం’ని పక్కన పెట్టి, ‘థాంక్ గాడ్’ ట్రై చేస్తే ఎలా వుంటుంది.? అని కొందరు అనుకుంటున్నారట. 
అయితే, ‘వినోదయసితం’ రీమేక్‌ని అధికారికంగా ప్రకటించారు నటుడు కమ్ దర్శకుడు అయిన సముద్రఖని. ఆ సినిమాలో నటిస్తానని పవన్, సముద్రఖనికి మాటిచ్చారు. అలాటప్పుడు ఆ మాట తప్పడం కరెక్టు కాదు కదా. అసలే పవన్ కళ్యాణ్ ఆ తప్పు చేయనే చేయరు. ప్రచారం జరిగితే జరగొచ్చుగాక.. ఇంకా కుదిరితే, కాస్త దగ్గరగా వున్న కథ కాబట్టి కొన్ని సీన్లు తెలుగు నేటివిటీ నేపథ్యంలో మార్చుకుంటే మార్చుకోవచ్చు గాక. అంతేకానీ, పూర్తిగా ఈ సినిమాని పక్కన పెట్టేసి, ఆ సినిమాని లైన్‌లో పెట్టడమనే సాహసం పవన్ చేయకపోవచ్చునేమో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com