కువైట్కు సర్వీసును ప్రారంభించిన ఎయిర్ అరేబియా అబుధాబి
- September 15, 2022
అబుధాబి: కువైట్ నగరానికి కొత్తగా సర్వీస్ నెట్ వర్క్ ని విస్తరించినట్లు ఎయిర్ అరేబియా అబుదాబి ప్రకటించింది. 2022 అక్టోబర్ 31 నుండి కొత్త సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపింది. అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిరోజూ రెండు విమానాలను నడుపనున్నట్లు ఎయిర్ అరేబియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడెల్ అల్ అలీ తెలిపారు. కొత్త సర్వీసు రెండు నగరాల మధ్య టూరిజాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. 2020లో ప్రారంభమైన ఎయిర్ అరేబియా అబుధాబి ఇప్పటి వరకు కువైట్, బీరుట్, ఈజిప్ట్, బహ్రెయిన్, అజర్బైజాన్, ఇండియా, బంగ్లాదేశ్, టర్కీ, నేపాల్, సూడాన్, పాకిస్తాన్, ఒమన్, బోస్నియా, హెర్జెగోవినాతో సహా 26 మార్గాల్లో తన నెట్వర్క్ను విస్తరించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







