ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం...
- September 21, 2022
న్యూ ఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకున్నాం. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం పేరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేశాం. అయినా ఈనాటికి ఇంకా భారత్ లో బ్రిటీష్ పాలకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వారి పేర్లే కనిపిస్తున్నాయి. అందుకే ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటీస్ కాలం నాటి విధానాలకు ఇండియన్ ఆర్మీ గుడ్‌బై చెప్పనుంది. బ్రిటీష్ వలసరాజ్యాల గతాన్ని తుడిచివేయడానికి..భారతీయ వారసత్వానికి తగినట్లుగా యూనిట్లు, రెజిమెంట్లు,యూనిఫాంలలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రధాని మోడీ ఆదేశాలకు అనుగుణంగా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చొరవ తీసుకున్నారు.
దీంట్లో భాగంగా యూనిఫామ్‌లను, యూనిట్ పేర్లను మార్చాలని ఆర్మీ భావించారు. రెజిమెంట్లు, స్వాతంత్య్రం పూర్వం నాటి బిల్డింగ్‌ల పేర్లను కూడా మార్చనుంది. సిక్కు, గోర్ఖా, జాట్, రాజ్పుట్ లాంటి సైనిక యూనిట్ల పేర్లను మార్చాలని ఆర్మీ యోచిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే బీటింగ్ రిట్రీట్ లాంటి ఈవెంట్లను కూడా మార్చనున్నారు. రోడ్లు, సంస్థలు, పార్క్‌లకు పెట్టిన బ్రిటీష్ కమాండర్ల పేర్లను కూడా మార్చివేయనున్నారు.
ఇక నుంచి ఆర్మీ డే పరేడ్‌ను దేశ రాజధానిలో నిర్వహించరు. ఆర్మీ డే పరేడ్‌ను ప్రతి ఏడాది జనవరి 15వ తేదీన నిర్వహిస్తారు. ఇక నుంచి ఆ పరేడ్ ఢిల్లీ కాకుండా ఇతర నగరాల్లో చేపట్టనున్నారు. వచ్చే ఏడాది సదరన్ కమాండ్ ఏరియాలో ఆ పరేడ్‌ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. తూర్పు లడాఖ్‌లోని ఎల్ఏసీ వద్ద రెండు చోట్ల ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







