అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..

- September 23, 2022 , by Maagulf
అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..

అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఒప్పో పిరీస్‌ నుంచి వచ్చిన రెండు మొబైల్స్.. ఒప్పో ఎఫ్ 21 ఎస్ ప్రో, ఒప్పో ఎఫ్ 21 ఎస్ ప్రో 5జీ మోడల్స్‌ని రిలీజ్ చేసింది. వీటిలో ఒప్పో ఎఫ్ 21 ఎస్ ప్రో 4జీ ఫోన్‌పై అమెజాన్‌లో భారీగా ఎక్సేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. దాదాపు రూ.20000 పైనే డిస్కౌంట్ పొందొచ్చు. ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. ధర రూ.22,999. ఈ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్ కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం తగ్గింపు పొందొచ్చు. రూ.3,000 వరకు అదనంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. డాన్‌లైట్ గోల్డ్, స్టార్‌లైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసి ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గరిష్టంగా రూ.21,849 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా లభించే రూ.3,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఇందులోనే కలిపి ఉంటుంది. ఉదాహరణకు మీ పాత మొబైల్‌పై రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే అదనంగా రూ.3,000 కలిపి మొత్తం రూ.18,000 తగ్గింపు లభిస్తుంది. ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల బాగా పాపులర్ అయిన 4జీ ప్రాసెసర్ ఇది. ఇదే ప్రాసెసర్ వివో టీ1 44W, వివో టీ1ఎక్స్, రియల్‌మీ 9, ఒప్పో ఎఫ్21 ప్రో, ఐకూ జెడ్6 లాంటి మోడల్స్‌లో ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com