గత 20 నెలలుగా 25 వేల మందికి పైగా ఐసిస్ ఉగ్రవాదులు హతం...
- April 18, 2016
గత 20 నెలలుగా బ్రిటన్, దాని మిత్ర దేశాల వైమానిక దాడుల్లో 25 వేల మందికి పైగా ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్(ఆర్ఎఎఫ్) కల్నల్ వారెన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వరుస దాడులతో ఐసిస్ కు కోలుకోని ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సిరియా, ఇరాక్‌లోని ఐఎస్ ఆధీన ప్రాంతాల్లో జిహాదీ ఉగ్రవాదుల సంఖ్య సగానికి తగ్గిందన్నారు. గత మూడు వారాల్లోనే 600 మంది ఉగ్రవాదులు మరణించారన్నారు. ఉత్తర ఇరాక్‌లోని దాదాపు ప్రస్తుతం 30 వేల మంది కంటే తక్కువే ఉన్నారు.తాము చేసిన దాడుల్లో ఐసిస్ చమురు క్షేత్రాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. గత కొన్ని నెలలుగా అమెరికా, సంకీర్ణ సేనలు జరుపుతున్న దాడులతో ఐసిస్ బలహీన పడిందన్నారు. ఒమర్ ఆల్-షిషానీ, జిహాది జాన్ సహా 100 మందిపైగా ఐసిస్ నేతలను మట్టుబెట్టినట్టు వారెన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







