పూరీ జగన్నాధ్ ఏంటీ.? గాడ్‌ఫాదర్‌కి నో చెప్పడమేంటీ.?
- September 26, 2022డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కి చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ, ఈ కాంబినేషన్ సెట్ కావడం లేదు. కానీ, ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.
అదెలాగంటారా.? డైరెక్టర్ - హీరో కాంబో కాదిది. విచిత్రమైన కాంబినేషన్ సెట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో పూరీ జగన్నాధ్ నటిస్తున్నాడట.. అనే న్యూస్ గత కొన్ని రోజులుగా సర్క్యలేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ గాసిప్‌పై తాజాగా చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు.
అవును నిజమే, చిరంజీవి సినిమాలో పూరీ జగన్నాధ్ నటించాడు. అది త్వరలో రిలీజ్ కాబోయే ‘గాడ్ ఫాదర్’ సినిమానే. ఈ సినిమాలో ఓ యూ ట్యూబర్ పాత్ర వుందట. ఆ పాత్రకు ఎవరిని తీసుకోవాలా.? అని డైరెక్టర్ మోహన్ రాజా ఆలోచిస్తుంటే, ఎవరో ఎందుకు.? మన పూరీని తీసుకుంటే పోలా.! అని సలహా ఇచ్చాడట.
చిరు సలహాకి మోహన్ రాజా షాకయ్యాడట. పూరీ ఏంటీ.? నటించడమేంటీ.? అని. అయితే, ఎందుకు నటించడు.. అని ఠకీమని పూరీకి ఓ ఫోన్ కొట్టాడట చిరంజీవి. మీ సినిమాలోనా నేను చచ్చినా చేయను సార్..’ అని చెప్పాడట పూరీ. ఎందుకంటే, మీ ఎదురుగా నేను కెమెరా ముందు నటించడం నా వల్ల కాదన్నాడట.
ఎట్టకేలకు ఒప్పుకోగా, ఆ సీన్లు తెరపై చాలా నేచురల్‌గా వచ్చాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తెలిపారు. మొత్తానికి చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కకపోయినా, ‘గాడ్ ఫాదర్’ రూపంలో ఏకంగా ఆయనతో పాటూ ఆయన సినిమాలోనే నటించే బంపర్ ఛాన్స్ కొట్టేశాడు పూరీ జగన్నాధ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా