CII జాతీయ అవార్డులు గెలుచుకున్న హైదరాబాద్ విమానాశ్రయం...
- September 26, 2022
హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (GBC) నిర్వహించిన 'ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్' 23వ జాతీయ అవార్డులలో GMR ఆధర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మక CII జాతీయ అవార్డులు ‘‘నేషనల్ ఎనర్జీ లీడర్’’ మరియు ‘‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్’’లను గెల్చుకుంది. ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్', 21వ ఎడిషన్ సందర్భంగా వీటిని ప్రకటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ‘‘నేషనల్ ఎనర్జీ లీడర్’’ మరియు ‘‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్’’ అవార్డులను గెలుచుకోవడం ఇది వరుసగా నాలుగవ మరియు ఆరవసారి. పారిశ్రామిక ప్రముఖుల నడుమ GHIAL చీఫ్ ప్రాజెక్ట్ అండ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ శ్రీ విజయ్ రాథోడ్, శ్రీ భిక్షం భూక్యా, ఏజీఎం-ఎలెక్ట్రికల్, ఈ అవార్డులను అందుకున్నారు.
గత మూడు సంవత్సరాల్లో, GHIAL సుస్థిరమైన ఇంధన సామర్థ్య చర్యలతో తన కార్యకలాపాలలో సుమారు 5.41 MU ల విద్యుత్తును ఆదా చేసింది. దీని వల్ల సుమారు 4426 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయి. దీని వల్ల గ్రీన్ హౌజ్ గ్యాసులు కూడా చెప్పుకోదగ్గ పరిమాణంలో తగ్గడం జరిగింది. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ యొక్క ఎయిర్ పోర్ట్ కార్బన్ అక్రెడిటేషన్ కింద హైదరాబాద్ విమానాశ్రయం లెవల్ 3+ “న్యూట్రాలిటీ”అక్రిడిటేషన్‌తో ‘కార్బన్ న్యూట్రల్’ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.
దీనిపై ప్రదీప్ పణికర్, సీఈఓ, జీహెచ్‌ఐఎఎల్, “సుస్థిరమైన కార్యక్రమాల పట్ల మాకున్న అచంచలమైన నిబద్ధతను, సహజ ఇంధన వనరులను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడానికి మా ప్రయత్నాలను ఈ అవార్డు పునరుద్ఘాటిస్తుంది. సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే పరిష్కారాలను అమలు చేయడంలో GHIAL ఎల్లప్పుడూ ముందుంటుంది. సుస్థిరత అనేది మా విమానాశ్రయ కార్యకలాపాలన్నిటిలో ప్రధానంగా ఉంటుంది. 2040 నాటికి నెట్ జీరో కార్బన్ సంస్థగా మారాలన్నది మా లక్ష్యం’’ అన్నారు.
తమ రోజువారీ కార్యకలాపాలలో ఉత్తమ పద్ధతులు మరియు సాంకేతిక పురోగతిని అవలంబిస్తూ, ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించే కార్యకలాపాలను ఈ వేదిక గుర్తిస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న సంస్థలు చేపడుతున్న ఇంధన పొదుపు చర్యలు, వినూత్నమైన ఆలోచనా ప్రక్రియలకు సంబంధించిన అనేక అంశాలను జ్యూరీ పరిశీలించింది.
ఇంధన సామర్థ్య రంగానికి ముఖ్యమైన మరియు వినూత్న పద్ధతులను ప్రోత్సహించేందుకు CII 'నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనెజ్మెంట్' అవార్డులను ప్రదానం చేస్తోంది. తద్వారా భారతీయ పరిశ్రమల ఇంధన సామర్థ్య, సుస్థిరమైన వృద్ధిని సులభతరం చేస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







