యూఏఈలో పాక్షిక సూర్యగ్రహణం: ఇలా చూడండి
- October 10, 2022
యూఏఈ: 2022 సంవత్సరంలో చివరి పాక్షిక సూర్యగ్రహణం అక్టోబర్ 25న యూఏఈలో కనిపిస్తుందని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ (DAG) వెల్లడించింది. పాక్షిక సూర్యగ్రహణం అనేది సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంభవించే అరుదైన సంఘటన అని డీఏజీ తెలిపింది. అయితే, ఈ సమయంలో సూర్యుడిని నేరుగా చూడవద్దని సూచించింది. కాగా అరుదైన ఖగోళ దృశ్యాలను వీక్షించేటప్పుడు కళ్ళను రక్షించుకోవడానికి అవసరమైన చిట్కాలను నిపుణులు తెలిపారు.
ఎప్పుడంటే..
ఈ అద్భుత ఖగోళ దృశ్యం అక్టోబర్ 25న మధ్యాహ్నం 2.42 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.54 గంటలకు ముగుస్తుంది. గరిష్ఠ గ్రహణం మధ్యాహ్నం 3.52 గంటలకు సంభవిస్తుంది.
ఎలా చూడాలంటే..
సరైన కంటి రక్షణ లేకుండా సూర్యగ్రహణాన్ని చూడవద్దని డీఏజీ హెచ్చరించింది. వీక్షకులు తప్పనిసరిగా ఫిల్టర్ ఉన్న సూర్యగ్రహణం అద్దాలు కొనుగోలు చేయాలని, దీని ద్వారా చూస్తే సూర్యుడు సహజమైన నారింజ రంగులో కనిపిస్తాడని తెలిపింది.
డీఏజీ వర్చువల్ గైడెడ్ టూర్
అక్టోబర్ 25న ముష్రిఫ్ పార్క్‌లోని అల్ తురయా ఖగోళ శాస్త్ర కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో గ్రహణాన్ని వీక్షించడానికి, ప్రత్యేక టెలిస్కోప్‌లు, సూర్యగ్రహణ గ్లాసెస్‌లు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ ధరలు వ్యక్తికి Dh30 నుండి ప్రారంభమవుతాయని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







