HCA అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మరో కేసు..
- October 10, 2022
హైదరాబాద్: HCA అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మరో కేసు నమోదైంది. ఇటీవల కాలంలో HCA తరుచు వివాదంలో చిక్కుంటున్న సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 25న ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేపథ్యంలో హెచ్‌సీఏ (HCA) మీద కేసుల మీద కేసులు నమోదయ్యాయి. అజారుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాహకులపై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మరో కేసు నమోదైంది.
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, హెచ్‌సీఏ మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు పిర్యాదు చేశారు. సెప్టెంబర్ 26 తేదీతోనే హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ గడువు ముగిసిందని.. అయినా పదవిలో కొనసాగుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బీసీసీఐతో పాటు ఈసీ కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా అజారుద్దీన్ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవి కాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారని కంప్లైంట్లో వివరించారు. ఈ నెల 18న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు అయ్యేందుకు అజారుద్దీన్ తన పదవి సమయాన్ని పొడిగించుకున్నట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకుని.. అజారుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







