ఆంధ్ర కళా వేదిక ఖతార్ వారి ఆధ్వర్యంలో 'కార్తీకమాస వనభోజనాలు'

- October 30, 2022 , by Maagulf
ఆంధ్ర కళా వేదిక ఖతార్ వారి ఆధ్వర్యంలో \'కార్తీకమాస వనభోజనాలు\'

దోహా: ఆంధ్ర కళా వేదిక - ఖతార్ కార్యవర్గం కార్తీక మాసం సందర్భంగా ఖతార్ లోని తెలుగు వారందరి కోసం "కార్తీకమాస వనభోజనాలు" కార్యక్రమాన్ని శుక్రవారం 28న మొట్టమొదటి సారి మెసయిద్ లోని ఫామిలీ పార్క్ లో నిర్వహించారు.  

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతార్ లోని తెలుగు వారి నుండి అనూహ్యమైన స్పందన వచ్చిందని, ఒక్కరోజు వ్యవధిలోనే ౩౦౦కి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకుని రికార్డు సృష్టించారు అని తెలిపారు.ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమానికి సుమారు 450 మంది హాజరయ్యారని, ఎండని, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా విచ్చేసిన పిల్లా పెద్దా అందరూ కార్యక్రమాన్ని ఆసాంతం ఆనందించారని అని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితులు(స్పాన్సర్స్)కి, సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పలువురు తెలుగు ప్రముఖులు, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) జనరల్ సెక్రటరీ  కృష్ణకుమార్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) నుండి రజని మూర్తి , తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్, తెలుగు బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షులు Luthfi, సత్యనారాయణ మలిరెడ్డి,గొట్టిపాటి రమణ,హరీష్ రెడ్డి  మరియు తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో(తంబోలా,టగ్ అఫ్ వార్, Treasure హంట్, "ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడు") గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. లక్కీ డ్రా లో గెలిచిన మొదటి ముగ్గురికి బంగారు నాణేలు(2 Grams), ఉసిరి చెట్టు కొమ్మల క్రింద రుచికరమైన సాంప్రదాయ విందు భోజనం మరియు మసాలా మజ్జిగ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, కెటి రావు, వీబీకే మూర్తి, శిరీషా రామ్,సాయి రమేష్,సోమరాజు మరియు రవీంద్ర కి, హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com