సైనసైటిస్ లక్షణాలు..

- April 21, 2016 , by Maagulf
సైనసైటిస్ లక్షణాలు..

 
అక్యూట్ సైనసైటిస్ లక్షణాలు సైనస్ ఉన్న భాగాల్లో నొప్పి, ఒత్తిడి కలగడం, చీముతో కూడిన స్రావాలు ముక్కు నుండి బయటకు రావడం, ముక్కు దిబ్బడ వంటివి ప్రధాన లక్షణాలు. కారణాలు1. ముక్కులో వచ్చే ఇన్‌ఫెక్షన్స్ సైనస్‌ను కప్పబడిన మ్యూకస్ మెబ్రేన్ ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్‌తో సంబంధం కలిగి ఉంటుంది. అందువలన ఎటువంటి అంటువ్యాధి అయినా ముక్కు నుండి చాలా సులభంగా సైనస్‌లకు చేరుతుంది.ఈ సైనస్లు ముక్కు రంధాల్లోకి తెరుచుకొని ఉంటే అంటువ్యాధి త్వరగా తగ్గిపోతుంది. ఒకవేళ వాటిలో ఏదైనా అడ్డు ఉంటే, అంటువ్యాధి త్వరగా తగ్గదు. ఇది ముఖ్యంగా వైరస్ వల్ల వస్తుంది. 2. ఈత కొట్టడం ఒక్కొక్క సారి సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉన్న నీళ్ళలో ఈతకొట్టడం వల్ల ఆ నీళ్ళు సైనస్‌లోకి ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి. స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ గ్యాస్ ముక్కు రంధాల ద్వారా సైనస్‌ల్లోకి చేరి సైనస్‌లోని మ్యూకస్ మెబ్రేన్ వాచేటట్లు చేస్తుంది. అది క్రమంగా 'సైనసైటిస్'ని కలుగజేస్తుంది.3. ట్రోమా ఒక్కొక్కసారి సైనస్‌ల్ని తయారుచేసిన ఎముకలు విరగడం వల్ల వాటికి అంటు చేరి సైనస్ మూకోసాకు అంటును కలుగచేస్తుంది. దంతాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్ కూడా కలుగచేయవచ్చు. ఇతర కారణాలు1. సైనస్‌లో సరైన వెంటిలేషను లేకపోవడం, సైనస్‌ల్లో అడ్డు సాధారణంగా సైనస్‌ల్లో బాగా వెంటిలేట్ అయి ఉంటాయి. సైనస్‌ను కప్పి ఉంచిన మ్యూకోసా మూకస్ ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ద్రవాలు సీలియరీ మూమెంట్ వల్ల సైనస్ ఆస్టియాను చేరి అక్కడ నుండి ముక్కురంధ్రాల్లోకి చేరుతాయి. ఒకవేళ ఇలా జరగడానికి సైనస్‌ల్లో ఏదైనా అడ్డుకుంటే సైనస్‌లో తయారయ్యే పదార్దాలు అక్కడే నిలవ ఉండి సైనస్లో విధులకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా సైనస్‌లో నాసల్ పేకింగ్, స్ఫుటం మెక్క నిర్మాణంలో తేడా రావడం, మేలిగ్నెంట్/నియోప్లాసం వల్ల అడ్డు ఏర్పడుతుంది.2. నాసల్ కేవిటిలో ద్రవాలు నిలువ ఉండటం అప్పుడప్పుడు ముక్కులోని ద్రవాల చిక్కదనం వల్ల లేదా ఏదైనా అడ్డు ఉండటం వల్ల నాసాఫారింగ్స్‌లోకి వెళ్ళకుండా ఉండి, అవి అంటు కలుగజేస్తాయి.3. పూర్వం వచ్చిన సైనసైటిస్ ఎటాక్స్ ఎక్కువ సార్లు సైనసైటిస్ రావటం వల్ల సైనప్ మ్యూకోసా దెబ్బతిని ఉండటం వల్ల మళ్ళీ సైనసైటిస్ వచ్చేటట్లు చేస్తుంది. 4. వాతావరణం వాతావరణం తేమగా, చల్లగా ఉన్నప్పుడు సైనసైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 5. ఇతర అంటువ్యాధులు పుష్టికరమైన ఆహారం తీసుకోకపోవటం, మీసిల్స్, చెకెన్‌పాక్స్, కోరింత దగ్గు వంటి అంటు వ్యాధులతో బాధపడటం, డయాబెటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు సైనసైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. 6. సూక్ష్మజీవులు చాలా కేసుల్లో సైనసైటిస్ వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు ప్రారంభమై, తర్వాత నెమ్మదిగా బాక్టీరియా చేరి సైనసైటిస్ వ్యాధి వస్తుంది. ఇటువంటి హానికర సూక్ష్మజీవుల్లో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, హీమోఫిలస్ ఇంఫ్లూయంజా, స్టెపైలోకోకస్ ఆర్.ఇ.యస్‌లు ముఖ్యమైనవి. సైనసైటిస్ వల్ల సైనస్‌ల్ని కప్పి ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతుంది. దాని వల్ల అవి ఎక్కువగా ద్రవాలను ఉత్పత్తి చేయడమే కాకుండా పాలీమార్సో న్యూక్లియర్ కణాలను కూడా తయారుచేస్తాయి. సైనస్ ఆస్టియమ్ ఈవిధంగా తయారైన ద్రవాలను బయటకు పంపించగలిగి, శరీరానికి తగ్గిన వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు వ్యాధి త్వరగా తగ్గిపోతుంది. అలాకానప్పుడు అంటు అధికమై మూకోసల్ మెంబ్రేన్, సైనస్ ఎముకల మీద కూడా ప్రభావం కనబడుతుంది. దంతాలకు అంటు ఉన్నటైతే అది చాలా సులభంగా సైనస్‌లకు వ్యాపించి సైనసైటిస్‌లను కల్పించవచ్చు. అందువల్ల దంతాల్లోకి అంటును ముండుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలి. వ్యాధి నిర్ధారణ వ్యాధి లక్షణాలు పూర్తిగా తెలుసుకోవడం వలన, సైనస్ ఎక్స్-రే ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. నివారణ1. ఎలర్జీ కలిగించే వస్తువుల్ని దూరంగా ఉంచాలి. 2. తగిన పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయటం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవాలి.3. శ్వాసకోశ అంటువ్యాధులతో బాధపడుతూ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. 4. శ్వాసకోశ వెలుపలి భాగాల్లో అంటు 7-10 రోజుల కంటే ఎక్కువ కాలం ఉన్నటైతే వైద్యుని సలహా పాటించడం మంచిది.5. సైనస్‌ల్లో నొప్పి ఉన్నా, ముక్కు నుండి వచ్చే స్రావాల రంగు మారినా, చెడువాసన వస్తున్నా, వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం.చికిత్స 1. వైద్యుని సహకారంతో అమాక్సిసిల్లిన్ లేదా ఆంపిసిల్లీన్ మందులు ఇవ్వవచ్చు.2. పెన్సిలిన్ మందులకు రోగి అలర్జీ కలిగి ఉన్నట్లైతే ట్రైమితోప్రిం గానీ, సల్ఫోమితాక్సజోల్ అనే మందులు ఇవ్వవచ్చు.3. ఓరల్ డ్రింక్సోరాల్, డిమోటాప్ ఇవ్వవచ్చు. 4. సెలైన్ యిరిగేషన్ వలన గట్టిగా ఉన్న స్రావాలు మెత్తబడి బయటకు స్రవించే అవకాశం ఉంది.5. స్టీ పీల్చుకొనుట ద్వారా, ఎక్కువ ద్రవాలను లేదా పానీయాలను సేవించుట ద్వారా, లోకల్ హీట్ (వేడి తడిబట్టలను సైనస్ల మీద ఉంచటం) ద్వారా ముక్కు నుండి స్రావాలు బయటకు వచ్చి రోగికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 6. సేషల్ స్ప్రేలు రోగికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. కానీ, నేషల్ స్ప్రేలు అవసరంకంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించినట్లయితే ముక్కు దిబ్బడ కలిగే ప్రమాదం ఉంది. కనుక రోగి జాగ్రత్తగా వీటిని ఉపయోగించవలెను. సాధారణంగా సైనసైటిస్ మందుల ద్వారా తగ్గుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మందులకి తగ్గనప్పుడు శస్త్రచికిత్స ద్వారా ఈ వ్యాధిని తగ్గిస్తారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com