పసిడి ధర పెరిగింది..
- April 21, 2016
పెళ్లిళ్ల సీజన్ డిమాండుతో పసిడి ధర పెరుగుతూనే ఉంది. గురువారం రూ.400 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.29,900కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగల వ్యాపారులు కొనుగోళ్లు చేస్తుండటం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.03శాతం పెరిగి 1,257.10 అమెరికన్ డాలర్లకు చేరింది.గురువారం వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. రూ.2,400 పెరగడంతో కేజీ వెండి ధర రూ.40,900కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి భారీగా కొనుగోళ్లు జరుగుతుండటంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 17.40 అమెరికన్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!









