అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- March 07, 2026
యూఏఈ: అబుదాబిలోని ముస్సాఫా ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్న ఇండెక్స్ రెస్టారెంట్‌ను మూసివేయాలని అబుదాబి వ్యవసాయ మరియు ఆహార భద్రతా అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
అబుదాబి ఎమిరేట్‌లో ఆహార భద్రతపై 2008 నాటి చట్టం నంబర్ (2) మరియు దాని సంబంధిత నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ రెస్టారెంట్ మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
వాణిజ్య లైసెన్స్ (CN-1759994) కలిగి ఉన్న ఈ సంస్థ ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అథారిటీ తెలిపింది.
ఈ సంస్థ పదే పదే ఆహార భద్రత ఉల్లంఘనలకు పాల్పడుతుందని, అధికారులు సూచించిన సేఫ్టీ చర్యలను అమలు చేయడంలో వైఫల్యం కారణంగా మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ స్పష్టం చేసింది.
ఆహార భద్రత మరియు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటానికి "తక్షణ జోక్యం" కింద ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
--బాజీ షేక్(యూఏఈ)
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







