ముందస్తు ఎన్నికలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్..
- November 15, 2022
హైదరాబాద్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు గులాబీ బాస్. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేదన్న గులాబీ బాస్.. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించారు. మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉంటూ పర్యవేక్షించాలని, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీయాలన్నారు. పార్టీ, ప్రభుత్వ పరంగా ఉన్న లోటుపాట్లను తన దృష్టికి తీసుకురావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలిచి మూడోసారి అధికార పగ్గాలు దక్కించుకుంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
”అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలి. మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉంటూ పర్యవేక్షించాలి. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీయాలి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఉన్న లోటుపాట్లను నా దృష్టికి తీసుకురావాలి. వచ్చే ఎన్నికల్లో కూడా మనం గెలిచి మూడోసారి అధికార పగ్గాలు దక్కించుకుంటాం” అని గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన కీలక సమావేశంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మంత్రి మరో ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. వంద ఓటర్లకు ఒక ఇంఛార్జిని నియమించాలన్నారు. 10 రోజుల్లో ఇంఛార్జుల నియామకం పూర్తి కావాలన్నారు. బీజేపీతో ఇక యుద్దమేనని స్పష్టం చేశారు. ఈరోజు నుంచి ఎమ్మెల్యేలంతా ఫీల్డ్ లోనే ఉండాలని, క్యాలెండర్ బేసిస్గా వర్క్ చేయాలని సూచించారు గులాబీ బాస్.
తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చ జరిగింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







