సూపర్ స్టార్ కృష్ణ మృతికి TFJA తీవ్ర సంతాపం
- November 15, 2022
హైదరాబాద్: భారతీయ చలన చిత్ర చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ ది ఓ సువర్ణాధ్యాయం. నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి వ్యక్తి నుండి వ్యవస్థగా మారిన బంగారు మనిషి కృష్ణ. మహా నటుడు ఎన్టీయార్, ఏయన్నార్ అడుగు జాడల్లో నడుస్తూ, శోభన్ బాబుతో కలిసి తెలుగు సినిమా రంగానికి నాలుగో స్థంబంలా నిలిచారాయన. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్ గా అన్ని రంగాలపైనా పట్టు సంపాదించుకుని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషలలోనూ పలు చిత్రాలను నిర్మించారు. 300కు పైగా చిత్రాలలో నటించారు. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబోయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70 ఎం. ఎం. మూవీ డైరెక్టర్ కమ్ హీరో... చిత్రసీమలో డేరింగ్ డాషింగ్ అనే పదాలకు నిలువెత్తు నిర్వచనం కృష్ణ. ఆయన మరణం కోట్లాది మంది అభిమానులను దుఃఖ సాగరంలో ముంచింది. సూపర్ స్టార్ కృష్ణ లేని లోటు పూడ్చలేనిది.
ఆయన మృతికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అందరి సభ్యుల తరుపున అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీనారాయణ, వై. జె. రాంబాబు తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు. ఒకే యేడాది సోదరుడిని, తల్లిదండ్రులను కోల్పోయిన మహేశ్ బాబుకు, ఘట్టమనేని ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA) ప్రార్థిస్తోంది.

తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







