జుట్టు ఆరోగ్యానికి మెంతి వాటర్ స్ప్రే..
- December 03, 2022
జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలంటే మెంతి గింజలు అద్భుతమైన ఔషధం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదంలో అనేక చర్మ మరియు జుట్టు సమస్యలకు మూలికా మందులను ఉపయోగిస్తారు. షాంపూలు, సీరమ్‌లు, హెయిర్ ప్యాక్‌లు, నూనెలు వంటి అనేక హెర్బల్ హెయిర్ కేర్ ఉత్పత్తులు వెంట్రుకల కుదుళ్లను బలంగా ఉంచుతాయి. ఇవి మీ జుట్టును బలోపేతం చేయడానికి, కండిషన్ చేయడానికి, మృదువుగా చేయడానికి ఉపయోగిస్తారు. ఆహారంలో మెంతి కూరను తీసుకోవడం. వారానికి ఒకసారి జుట్టుకు మెంతి ఆకును గ్రైండ్ చేసి ఆ రసం అప్లై చేయడం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టుకు ఉన్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించవచ్చు. చివర్లు చిట్లిపోవడం, అధిక జుట్టు రాలడం వరకు అనేక సమస్యలను నివారించవచ్చు. ప్రతి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌లో మెంతులు తప్పని సరిగా జోడిస్తున్నారు. ఇంట్లోనే తయారు చేసుకునే మెంతి హెయిర్‌స్ప్రేని గురించి తెలుసుకుందాము. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు కోసం రూపొందించబడింది.
మెంతి స్ప్రే తయారీకి కావలసినవి: 2 కప్పుల నీరు 1 స్ప్రే బాటిల్
1 కప్పు మెంతి గింజలు
స్టెప్ 1: ఒక గాజు గిన్నెలో మెంతి గింజలను వేసి నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి.
స్టెప్ 2: మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి ఒక స్ప్రే బాటిల్‌లో నింపండి. గింజలను తినేయొచ్చు లేదా గ్రైండ్ చేసి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించ వచ్చు.
స్టెప్ 3: స్ప్రే బాటిల్‌లో నింపిన నీటిని మీ స్కాల్ప్ మొత్తం తడిచేలా స్ప్రే చేయండి. ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయండి.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!