కువైట్ సంచలన నిర్ణయం..
- December 03, 2022
కువైట్ సిటీ: కువైట్ విద్యాశాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. స్కూల్స్‌లో మెటల్ థర్మోస్ వాటర్ బాటిల్స్‌ను బ్యాన్ చేసింది. దీనికి కారణం ఇటీవల అక్కడి ఓ స్కూల్‌లో జరిగిన ఒక సంఘటన. ఓ ఎలిమెంటరీ విద్యార్థి తోటి విద్యార్థిపై మెటల్ థర్మోస్‌తో దాడికి పాల్పడ్డాడు. దాంతో బాధిత విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడట. ఈ ఘటన నేపథ్యంలోనే విద్యామంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో మెటల్ థర్మోస్ వాటర్ బాటిల్స్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదట అబ్బాయిలకు మాత్రమే ఇలా ఈ వాటర్ బాటిళ్లను స్కూళ్లకు తీసుకురావడాన్ని అధికారులు నిషేధించారు. కానీ ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని విద్యార్థులందరికీ (అబ్బాయిలు, అమ్మాయిలకి కూడా) అమలు చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







