భారత రాయబార కార్యాలయంలో ఘనంగా బహుభాషా కవితా సదస్సు
- December 04, 2022
బహ్రెయిన్: భారత్-బహ్రెయిన్ దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాల సందర్భంగా భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఖ్వాబ్గాహ్: హౌస్ ఆఫ్ డ్రీమ్స్’ పేరిట బహుభాషా కవిత్వం "సదక్తు దోస్తీ కా"ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 6:00 గంటలకు సీఫ్‌లోని భారత రాయబార కార్యాలయంలో జరిగింది. కవిత్వ సెషన్‌ను ఖ్వాబ్గా వ్యవస్థాపకులు అనుపమ్ రమేష్ కింగర్ సమన్వయం చేశారు. ఈ సందర్భంగా "మెయిన్, నూర్ బానో", "రామ్ రత్తన్ హజీర్ హో", "జిల్-ఎ-తబాహి" , "ఐ డోంట్" అనే కార్యక్రమాలను ప్రదర్శించారు. వీటితోపాటు 28 ఆడియో కథనాలు, 17 ప్రత్యక్ష కవితా సమావేశాలను కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ, భార్య మోనికా శ్రీవాస్తవ హాజరయ్యారు.
సుమారు గంటన్నర పాటు సాగిన "సదకతు దోస్తీ కా" కార్యక్రమంలో భారతదేశం, బహ్రెయిన్ నుండి ఎనిమిది మంది ప్రముఖ కవులు పాల్గొన్నారు. వారు ఆంగ్లం, హిందీ, అరబిక్ భాషలలో తమ అసలు కవిత్వాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు హమీద్ అల్ ఖైద్, నివేదిత రాయ్, డాక్టర్ నబీలా జుబారీ, పర్వీందర్ కౌర్, సుదీప్ దేశ్‌పాండే, ఫాతిమా మొహసేన్, కావ్య రంజిత్, మనార్ అల్ సమ్మక్, సైరా రంజ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







