వైద్య చట్టాల ఉల్లంఘన: వ్యక్తిపై అభియోగాలు నమోదు
- December 05, 2022
సౌదీ: సౌదీలోని పబ్లిక్ హెల్త్ చట్టాలను ఉల్లంఘించిన ఓ వ్యక్తిపై విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. సోషల్ మీడియాలో ఓ వైరల్ వీడియో ఆధారంగా సదరు వ్యక్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. ఆ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తప్పుడు వైద్య సమాచారాన్ని పోస్ట్ చేసాడని, ఆ వీడియోను ఓ హోటల్‌లో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. మెడికల్ స్పెషాలిటీలో తనకు ఎటువంటి విద్యా అర్హతలు లేకపోయినా లేదా సమర్థ అధికారుల నుండి మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి ఎటువంటి చట్టపరమైన పత్రాన్ని కలిగి లేనప్పటికీ తాను వైద్య సలహాలను అందిస్తున్నట్లు సదరు వీడియో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఆరోగ్య విధానాలను నిర్వహించడానికి లేదా రోగులకు వైద్యపరమైన అభిప్రాయాన్ని అందించడానికి అతనికి అధికారం లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







